VZM: చీపురుపల్లిలో నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే, స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రూ. 2 కోట్లుతో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. నాణ్యతతో, నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.