TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గతంలో హరీష్‌రావుపై నమోదైన FIRను హైకోర్టు క్వాష్ చేయడంతో, ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.