MDK: PRTUTS హవేలీ ఘనపూర్ మండల శాఖ 2026 నూతన క్యాలెండర్ను సోమవారం మండల వనరుల కేంద్రం, కూచన్ పల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి మంచి ఫలితాలను సాధించేలా కృషి చేయాలన్నారు.