సత్యసాయి: అనంత వెంకటరెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా అనంతపురం పట్టణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి అనంత వెంకటరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.