TG: గూగుల్‌లో వెబ్సైట్లకు రివ్యూలు ఇస్తే వేల రూపాయలు సంపాదించవచ్చంటూ వస్తున్న ప్రకటనలను ప్రజలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట వాట్సాప్, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఇంట్లో ఉంటూనే సులభంగా డబ్బులు సంపాదించవచ్చన్న ఆశ చూపించి మోసగాళ్లు వల వేస్తున్నారని పోలీసులు చెప్పారు.