AP: ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తూ.గో.జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై పూర్తిగా దగ్ధమైంది. వేకువజామున ట్రావెల్స్ బస్సులోని సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపివేశారు. అందులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.