VSP: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో జగన్ చేసిందేమీ లేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ విశాఖ ఎంవీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2014-19 టీడీపీ హయాంలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదించారని అన్నారు. వైసీపీ నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు తలమానికమవుతుందని ఆయన అన్నారు.