PPM: పాలకొండ పట్టణంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ డా,ప్రభాకరరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాంటీన్లో అందుతున్న ఆహార నాణ్యతపై ఆరా తీశారు. పేదలకు అందిస్తున్న అల్పాహారం, భోజనం నాణ్యతను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, లేదా అని రిజిస్ట్రార్ తనిఖీ చేశారు.