కృష్ణా: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పొట్టిపాడు టోల్గేట్ వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ సీఐ ఎల్.రమేష్ నేతృత్వంలో ఆత్కూరు ఎస్సై నరసింహ మూర్తి, సిబ్బంది పాల్గొని వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.