ASR: జీకేవీధి మండలం దామనాపల్లిలో మంగళవారం ఏవో డీ. గిరిబాబు పర్యటించారు. రబీ సీజన్‌కు సంబంధించిన వరి నారుమళ్లను పరిశీలించారు. అనంతరం పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. వరి సాగులో నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. వేరుశనగ పంట సాగు చేసేందుకు పలువురు ఆసక్తిగా ఉన్నారన్నారు. రైతులకు 90శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.