NLR: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రతి పథకం అవసరమని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎంపీ, దిశ కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ నెల్లూరులో జరిగిన 3వ దిశ కమిటీ సమావేశంలో ఆయన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి పాల్గొన్నారు.