VSP: కొండకర్ల ఆవ వద్ద పక్షుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ.. పక్షులు, ఆవను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్, రసాయనాల వినియోగం వల్ల పక్షులు, మత్స్యసంపదకు తీవ్ర నష్టం జరుగుతోందని హెచ్చరించారు.