జనగామ పట్టణ కేంద్రంలోని చంపక్ హిల్స్‌లో జరుగుతున్న జిల్లా కోర్టు భవన నిర్మాణ పనులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.