1983 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ 67 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ.270 కోట్లు ఉంటుందని అంచనా. ఓ నివేదిక ప్రకారం కపిల్ దేవ్ ఏటా రూ.12 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆయన సంపదలో బ్రాండ్ ఎండార్స్మెంట్లు, బహిరంగ ప్రదర్శనలు, క్రీడలకు సంబంధించిన పెట్టుబడులతో పాటు కపిల్ దేవ్స్ ఎలెవెన్ అనే రెస్టారెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.