NLR: కావలి రూరల్ మండలం కొండయ్యగారిపాలెం సమీపంలో అమ్మవారి గుడి వద్ద కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు ఎస్సై తిరుమలరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి రూ. 10,050 నగదు, ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుచునున్నారు.