HYD: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో మహిళా సంఘాలపై మాట్లాడారు. ఇప్పటికే వారికి బస్సులు కేటాయించి ఆదాయం వచ్చేలా చూస్తున్నామన్నారు. వచ్చిన ఆదాయంతో మరిన్ని వ్యాపారాలు ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ కాంటీన్లను మహిళలకే ఇచ్చామని చెప్పారు. 20 రకాల వ్యాపారాలపై హైదరాబాద్లో 10 రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు.