PPM: పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో మంగళవారం అగ్నిప్రమాద సంభవించి జాగాన గౌర్నాయుడు అనే రైతుకు చెందిన 7 గడ్డిగుప్పలు 25 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతి అయింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు గురించి రైతును అడిగి తెలుసుకున్నారు.