AP: సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హెచ్చరించారు. మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చట్టాలపై అధ్యయనం చేయాలని సూచించారు. అసభ్య పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.