KMM: తండ్రి చితికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన మంగళవారం మధిర మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఇల్లూరుకు చెందిన కోట వెంకటరత్నం కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో మృతిచెందాడు. కాగా వెంకటరత్నంకు మగ సంతానం లేదు. ఈ నేపథ్యంలో సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆయన పెద్ద కూతురు నాగేంద్ర తండ్రి చితికి బరువెక్కిన గుండెతో తలకొరివి పెట్టింది.