VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఇంఛార్జ్ తహసీల్దార్ పి.సునీత వీఆర్వోలకు, వీఎస్లకు రెవెన్యూ క్లినిక్ పై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పారదర్శకంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ పున్నయ్య, రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు పాల్గొన్నారు.