చలికాలం కదా అని చాలా మంది స్నేహితులతో కలిసి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడే కూర్చుని సరదాగా మద్యం సేవిస్తారు. అయితే మంట నుంచి వచ్చే వేడి, ఆల్కహాల్ రెండూ కలిసి శరీరాన్ని త్వరగా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. దీంతో తలనొప్పి, నీరసం వస్తాయి. మత్తులో ఉన్నప్పుడు అదుపు తప్పి మంటలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది.