MBNR: ప్రసిద్ధ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మల మహా జాతరకు రావాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డిని మంగళవారం మంత్రి సీతక్క ఆహ్వానించారు. రెండు ఏళ్లకోసారి వైభవంగా జరిగే ఈ మేడారం జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.