MDK: అల్లాదుర్గ్ పోలీస్ సర్కిల్ పరిధిలో చైనా మాంజా (సింథటిక్/నైలాన్ దారం) విక్రయాలు, వినియోగం చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అల్లాదుర్గ్ సీఐ రేణుక హెచ్చరించారు. చైనా మాంజా పర్యావరణానికి, మానవ ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.