MLG: మంగపేట మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లు నుండి వెలువడుతున్న దుమ్ము, ధూళి, పొట్టు వ్యర్థాలు, దుర్వాసన వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అనుమతులు లేకుండానే మిల్లు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.