TG: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 198 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని TSPRB ఛైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. వీటికి జనవరి 20 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదని స్పష్టం చేశారు.