VZM: కొత్తవలస పంచాయతీ పరిధిలో ఇంఛార్జ్ కార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో సానిటరీ మేస్త్రి ప్రసాద్ పర్యవేక్షణలో ఇవాళ జేసీబీ సహాయంతో పేరుకుపోయిన చెత్తను లారీల్లో తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు చెత్త రహిత పంచాయితీ లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.