AP: నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు గిరిధర్ని ఎమ్మెల్యేగా చూడాలని ఉందని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటే గిరిధర్ ఎమ్మెల్యే అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కావడానికి పార్టీ నేతలు సహకరించాలని కోరారు.