WNP: గోపాల్పేట ఎస్ఐగా జగన్ మోహన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ నరేష్ కుమార్ బదిలీపై వనపర్తి జిల్లా వీఆర్ ఎస్పీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. నూతన ఎస్ఐగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. మండల పరిధిలోని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.