సోమనాథ్ ఆలయంపై తొలి దాడి జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా PM మోదీ స్పందించారు. ఎన్ని దాడులు జరిగినా భారతీయుల అచంచల ధైర్యంతో ఈ ఆలయం మళ్లీ నిలబడిందన్నారు. సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ కృషితో 1951లో ఆలయం పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. ‘విధ్వంసం గెలవదు, నిర్మాణమే నిలుస్తుంది’ అని ఈ ఆలయం నిరూపించిందని.. అదే స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మిద్దామని పిలుపునిచ్చారు.