ASR: అరకు లోయ అందాలు అద్భుతమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం అరకు లోయ, డుంబ్రిగుడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. గిరిజనుల వస్త్రధారణలో థింసా కళాకారులతో నృత్యం చేస్తూ సందడి చేశారు. స్థానిక గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు.