ప్రకాశం: కనిగిరి పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీ పై ప్రత్యేక దృష్టి సాధించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ అన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఒకటవ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు ఇంట్లో వచ్చే చెత్తను సైడ్ కాలువల్లో వేయవద్దని, ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.