SKLM: విజయనగరం జిల్లా పూసపేటరేగ(M) చింతల అగ్రహారం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు నందిగాం(M) కాపు తెంబూరు గ్రామానికి చెందిన గజరావు నగేశ్(31) గా పోలీసులు గుర్తించారు. లగేజీ వ్యాన్‌తో విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్న నగేష్, వాహనాన్ని ఆపి కాలకృత్యాల కోసం రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.