TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో హరీష్ రావును విచారించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంలో చుక్కెదురైంది.