పక్షులు కేవలం ప్రకృతికి అందం మాత్రమే కాదు.. అవి పర్యావరణ రక్షక దళాలు. పంటలను నాశనం చేసే కీటకాలను తింటూ రైతన్నకు నేస్తాలుగా ఉంటాయి. విత్తనాలను వ్యాప్తి చేస్తూ అడవుల పెంపకంలో కీలక పాత్ర పోషిస్తాయి. పక్షులు లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఈ ‘జాతీయ పక్షుల దినోత్సవం'(జనవరి 5) రోజున పక్షుల ఆవాసాలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేద్దాం.