TG: రాష్ట్రంలో ఇకపై కొత్త వ్యక్తిగత వాహనాలకు షోరూం నుంచే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగనుంది. ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ‘వాహన్’ పోర్టల్ ద్వారా డీలర్లే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈ విధానం రానుంది. సాధారణ నంబర్ అయితే వెంటనే పని పూర్తవుతుంది. వాణిజ్య వాహనాలకు మాత్రం పాత పద్ధతే ఉంటుంది.