GDWL: శాంతిభద్రతల పరిరక్షణలో మల్దకల్ మండల ప్రజల మన్ననలు పొంది, ఇప్పుడు బదిలీపై ధరూర్ వెళ్తున్న ఎస్సై నందికర్ సేవలు మరువలేనివని పోలీస్ బృందం పేర్కొన్నారు. మల్దకల్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ అయిన ఆయనకు శుక్రవారం పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, మల్దకల్ నూతన ఎస్సైగా కొండ శ్రీహరి నియమితులయ్యారు.