అనంతపురం ఉప రవాణా కమిషనర్ వీర్రాజు ప్రైవేట్ బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి అధిక ధరలు వసూలు చేయకూడదని ఆదేశించారు. ఆర్టీసీ ధరల కంటే గరిష్టంగా 50 శాతం మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా రవాణా శాఖ ధరలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.