VSP: గాజువాక అమరావతి పార్క్‌లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథులు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్‌రెడ్డి సనాతన ధర్మ రక్షణకు హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వామీజీల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి.