స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నూతన అడుగు వేశారు. JSW స్పోర్ట్స్ నుంచి విడిపోయి, సొంతంగా ‘వెల్ స్పోర్ట్స్’ (Vel SPorts) సంస్థను ప్రారంభించారు. 2016 నుంచి JSWతో అనుబంధం ఉన్న నీరజ్.. తన కెరీర్ విజయాల్లో ఆ సంస్థది నిర్ణయాత్మక పాత్ర అని గుర్తుచేసుకున్నారు. ఇకపై తన క్రీడా, వాణిజ్య కార్యకలాపాలను ఈ కొత్త సంస్థే పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.