HNK: వర్దన్నపేట MLA కేఆర్ నాగరాజు, ఐనవోలు ఆలయ కమిటీ సభ్యులు నేడు మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 13వ తేదీ నుండి ఐనవోలు జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో జాతరకు రావాలని వారు మంత్రిని ఆహ్వానించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి వారికి సూచించారు. తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.