తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఈనెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతేడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మంది గాయపడిన విషయం తెలిసిందే.