KRNL: కోడుమూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఇవాళ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అందించిన మెనూను క్రమంగా అందించాలని సూచించారు. జీసీడీవో స్నేహలత, ఏడీ నాగభూషణం పాల్గొన్నారు.