ASF: కాగజ్నగర్ మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని MIM పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ ముబీన్ ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు ఆయన వినతిపత్రం అందజేశారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సరిచేయాలని ఆయన కోరారు. దీనిపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.