MDK: అప్పుల భారాన్ని తట్టుకోలేక నిజాంపేట మండలం బచ్చురాజుపల్లికి చెందిన వడ్ల నవీన్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం తీసుకున్న లక్ష రూపాయల అప్పు విషయంలో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్థాపానికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. యువకుడి మృతితో గ్రామమంతా విషాద వాతావరణం నెలకొంది.