ADB: సమిష్టి నిర్ణయాలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ సర్పంచ్ వెంకటరావు, ఉప సర్పంచ్ మురళీ కృష్ణ, గ్రామస్తులు గజేందర్‌ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. గ్రామంలోని సమస్యలను విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.