TPT: మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. వారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లాలో మారిషస్ దేశ అధ్యక్షులు రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.