SRPT: ఎస్సీ, ఎస్టీ తరహాలో బీసీలకు చట్టబద్ధమైన సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్‌కు వినతిపత్రం అందజేశారు. మెజారిటీ జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక బడ్జెట్, రక్షణ కల్పించాలని, హక్కుల సాధన వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.