MNCL: విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ ఏడిఈ ప్రభాకర్, ఏఈ గణేష్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట గ్రామ శివారులోని రైతుల పొలాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాటను నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడితే తమకు తెలపాలని, వాటిని సరి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమల రాజు, తదితరులు పాల్గొన్నారు.