MDK: పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య శాసనమండలిలో ప్రభుత్వాన్ని కోరారు. చదువుతో పాటు ఆటలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం పాఠశాలల్లో మైదానాలను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు.