MBNR: నవాబ్ పేట మండలంలోని తీగలపల్లిలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎస్సై విక్రమ్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు.